పోలీసు సిబ్బంది సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత…… ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీసీపీ సుదీర్ కేకన్ ఐపిఎస్.,ఆదివారం రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్., (డిఐజి) ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ సిబ్బంది కి (సీపీఆర్,ఎఈడి )శిక్షణ మరియు హెల్త్ క్యాంపును మంచిర్యాల ఏసీపీ కార్యాలయం ఆవరణలో మెడి లైఫ్ హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది కార్డియోపల్మనరీరిసేసిటేషన్ మరియు ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్(సీపీఆర్, ఎఈడి ) వచ్చినప్పుడు మరియు యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం చేయాల్సిన సపోర్ట్ మరియు ప్రథమ చికిత్సపై పోలీస్ వారికి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా మంచిర్యాల డీసీపీ మాట్లాడుతూ… ఎవరైనా హార్ట్ ఎటాక్, ఫిట్ట్స్, పాముకాటుకు, కరెంటు షాక్ కు, యాక్సిడెంట్ కు గురైనప్పుడు ఆ అత్యవసర సమయంలో మనము అందించే సి పి ఆర్ శిక్షణ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడగలం అని అన్నారు. ఎక్కువగా ప్రమాదాలకు గురైన వెంటనే గాయపడ్డ వారికి మానసిక ధైర్యం కల్పించడంకోసం మనం సపోర్ట్ గా వుంటూ ఫ్రథమ చికిత్స అందించి అంబులెన్స్ కు సమాచారం అందించాలని అడిషనల్ డీసీపీ సిబ్బంది కి తెలిపారు….పోలీసు సిబ్బంది సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత అని, ఉచిత వైద్య శిబిరాలను పోలీసు సిబ్బంది ఉపయోగించుకోని బ్లడ్ షుగర్, బీపీ,ఈసీజ్ పిఎఫ్టి,2డి,ఇకో అల్ట్రాసౌండ్ ద్వారా పరీక్షలు సిబ్బంది చేపించుకోవడం జరిగింది. పోలీసులు రాత్రింబవళ్లు పని చేయడంతో పాటు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే గొప్ప సంపద అని సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యుల సలహాలను పాటించాలని సిబ్బందిని డీసీపీ ఆదేశించారు.
డాక్టర్ శ్రీధర్ రెడ్డి కార్డిలోజిస్ట్ మాట్లాడుతూ….అత్యవసర సమయంలో ఏమి చేయాలో చాలామందికి తెలియదని ఆ గోల్డెన్ అవర్ లో హార్ట్ ఎటాక్ గురైన వారికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుంది హార్ట్ ఎటాక్ వచ్చిన ఆసమయంలో సదరు వ్యక్తికి మనం ఇచ్చే ధైర్యం ముఖ్యమని అన్నారు.
డాక్టర్లు హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో ఎలాంటి చికిత్స అందించి క్షతగాత్రులను కాపాడాలో తెలియజేసారు.
కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కార్డిలోజిస్ట్ హైదరాబాద్ మెడిలైఫ్ హాస్పిటల్ డాక్టర్స్ చేతన్ చౌహన్, కుమార్ స్వామి, శ్రీనివాస్ సిరిపురం, జి. శ్రీనివాస్ లు మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ రాజు, మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, మహిళ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, సబ్ డివిజన్ ఎస్ఐ లు మరియు సివిల్ పోలీసులు 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




