గూడ గ్రామంలో ఆదివాసి సేన ఆధ్వర్యంలో మర్సు కోల రాంజీ గోండ్ 163వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆదివాసి సేన రాష్ట్ర కమిటీ సభ్యులు రాయిసిడం జంగు పటేల్ మాట్లాడుతూ భారత దేశ ప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడు ,బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండ్ గోండుల తొలి పోరాట యోధుడు బ్రిటీష్ నిజాం నిరంకుషాత్వాలకు ఎదురుండి ప్రాణాలర్పించిన తొలి ఆదివాసి పోరాటయోధుడు రాంజీగోండ్ అని కొనియాడారు. ఆయన స్పూర్తితోనే ఆదివాసీల అస్తిత్వ మనుగడ రక్షణకై మరో పోరాటానికి ఆదివాసి సమాజం సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
ఆదివాసి సేన తెలంగ్ రావు గూడ గ్రామ కమిటీ నాయకులు మేస్రం శ్యాంరావ్, మేస్రం చందు, కుమ్ర శ్రీనివాస్, మడవి ఈశ్వర్, జంగు బాపు, ఆకాశ్, ప్రవిణ్ తదితరులు పాల్గొన్నారు.




