అలంపూర్ జనంసాక్షి (ఏప్రిల్ 9)నిరుద్యోగ యువకులు అధైర్యం పడకండి బియస్పి అండగా నిలుస్తుంది అని డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉండవల్లి మండల పరిధిలోని
అలంపూర్ చౌరస్తా లోని వైష్ణవి స్కూల్లో సీరియస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గం లోని నిరుద్యోగులకు మెగా జాబ్ మేళాను బిఎస్పీ నాయకులు ఏర్పాటు చేశారు.జాబ్ మేళకు ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఉద్యోగం పొంది,ఆఫర్ లెటర్ తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
దాదాపుగా 50 కంపెనీలు వచ్చాయని, ఒక్కో కంపెనీకి ఐదుగురు చొప్పున సెలెక్ట్ అయ్యారని అన్నారు.ఉద్యోగం రాని వారు నిరాశ పడొద్దని అన్నారు.ప్రైవేట్ ఉద్యోగం అయినా,కష్టపడి కొత్త మెలకువలు నేర్చుకోని గొప్పగా ఎదగొచ్చని సూచించారు.మన ప్రాంతం వదిలి ఇంకో చోటుకి వెళ్లడానికి,భయపడొద్దని అన్నారు.
నిరంతరం విద్యార్థిగా ఉండాలని సూచించారు.భయపడితే గెలవలేమన్నారు.ఉద్యోగం వచ్చిన వారు డబ్బును జాగ్రత్తగాఖర్చుపెట్టాలని తెలిపారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎక్కడైనా,ఎప్పుడైనా గొప్పగా ఎదగొచ్చని ఆయన అన్నారు .
భయపడకుండా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు.
జీవితంలో ఒక మంచి మెంటర్ ను ఎంచుకోవాలన్నారు.
నేను ఉద్యోగంలో చేసినపుడు నా జీతం కేవలం 2వేలు మాత్రమేనని అన్నారు.భవిష్యత్ లో ఇంకా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు.డాటా సైన్స్ కోచింగ్ ఇచ్చి గొప్ప ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ ప్రాంతాన్ని పాలకులు పట్టించుకోలేదు, అంతే కాకుండా అలంపూర్ నియోజకవర్గం పై వివక్షత చూపుతూ ప్రభుత్వం డబ్బుల్ బేడ్ రూమ్ ల కేటాయించిడం మే తెలుస్తుంది అన్నారు.
కానీ బిఎస్పి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తామని,విద్య ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు.ఈ జాబ్ మేళా లో మొత్తం 850 మంది నిరుద్యోగులు హాజరై నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళలో స్వేరోస్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రవీణ్ మామిడాల, స్వేరోస్ వైస్ చైర్మన్ బాల ప్రసాద్ , సెంట్రల్ కమిటీ మెంబర్ బిఎస్పీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇంచార్జి ఎం జి కృష్ణ, రాంబాబు,నాగమోహన్, హేమంత్, జిల్లా కోఆర్డినేటర్ నల్లబోతుల కరుణాకర్, జిల్లా అధ్యక్షుడు అంజి, రాష్ట్ర అధ్యక్షుడు నవీన్, పెద్దఎత్తున నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.




