మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 19అత్యాచారం కేసులో నిందితుడికి నిందితుడికి జీవిత ఖైదు పడిందని మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి నేరేడ్ మెట్ లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒరిస్సాకు చెందిన అభి రామ్ దాస్(36) కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నీ బండ్లగూడ లో నివాసం ఉంటున్నారు.2021లో బండ్లగూడ వీకర్ సెక్షన్ లో నివాసముంటున్న మైనర్ బాలిక ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడు.ఇతని పై పోక్సో కేసు నమోదు చేయగా బుధవారం మల్కాజిగిరి కోర్టు జీవిత ఖైదు తో పాటు 5వేల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ కి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.




