Wednesday, 4 November 2026

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జూలపల్లి సర్పంచ్ కు సన్మానం

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ ఉత్తమ గ్రామపంచాయతీగా ఎన్నికైన శుభసందర్భంగా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జూలపల్లి సర్పంచ్ బోల్లపల్లి శంకర్ గౌడ్ ని, ఉప సర్పంచ్ ఫోలు దాసరిసాయికుమార్ ని, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి ని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఆడెపు సారయ్య, ఉపాధ్యక్షులు పోల్దాసరి సంపత్ ,క్యాషియర్ సాగర్ల సాగర్ ,ఇరుగురాల లక్ష్మయ్య, పోల్ దాసరి శ్రీనివాస్, ఆడెపు శేఖర్, పెనుగొండ సతీష్, సుంకిత సదానందం, ఇరుగురాల రాజు , గోస్కుల మల్లేష్, సాదుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.