అత్యాచారం కేసులో మారేడుపల్లి సిఐ

భర్తను బెదిరించి భార్యపై అత్యాచారం
ఫిర్యాదుతో కేసునమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి ): వనస్థలిపురంలో ఓ సీఐ అత్యాచార బాగోతం వెలుగులోకి వచ్చింది. మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పట్టుబడ్డాడు. వనస్థలిపురం లాడ్జిలో మహిళతో ఉండగా ఆమె భర్త రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నాడు. తన భార్యతో ఎఫైర్‌ పై ప్రశ్నించినందుకు సీఐ తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె భర్త ఆరోపించారు. మహిళ భర్త ఫిర్యాదుతో
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీఐపై అత్యాచారం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అయితే తన భర్తపై దాడి చేసి.. తనను అపహరించి ఇన్‌స్పెక్టర్‌ అత్యాచారం చేశాడని అతని భార్య వనస్థలిపురంలో ఫిర్యాదు చేసింది. స్పందించిన వనస్థలిపురం పోలీసులు ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వనస్థలీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగేశ్వర్‌రావు ఓ వివాహితను కిడ్నాప్‌ చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన భర్తపైనా దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. వనస్థలీపురం పోలీసులు సీఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు. నాగేశ్వర్‌రావును వనస్థలీపురం పోలీసులు సిఐని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నారు.