ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునీతాకృష్ణన్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన అత్యాచార నిందితుల ఫొటోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జాతీయ చానెళ్లు కూడా ఈ ఘటనపై స్పందించాయి. దీంతో అత్యాచారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన ఢిల్లీ నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.




