Sunday, 8 November 2026

బిజెపి ప్రభుత్వం తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

బిజెపి ప్రభుత్వం తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (25): బిజెపి ప్రభుత్వం తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన అన్నారు ఆదివారం మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో బిజెపి మండల మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం లో ఆమె పాల్గొన్నారు మహిళా మోర్చా సమావేశాలు ప్రతి మండల లో జరుపుతున్నామని గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేసి వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మహిళలు పని చేయాలని అన్నారు మహిళల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బేటి బచావో బేటి పడావో పథకం ద్వారా ఆడపిల్లలు నిష్పత్తి పెరిగిందని దీనివల్ల ఆడపిల్లలు చదువుకోగలుగుతున్నారని అమ్మాయిల వివాహ వయసు కూడా 21 సంవత్సరాలకు పెంచడం జరిగిందని దానివల్ల ప్రతి అమ్మాయి ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉందన్నారు కరోనా విపత్కర పరిస్థితిలోనూ దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేశారన్నారు ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ రేషన్ బియ్యం మరొక సంవత్సరం వరకు ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు గడువు పెంచడం జరిగిందని బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం మోడీ కృషి చేస్తూ దేశాన్ని ప్రపంచ స్థాయిలో బలమైన దేశంగా నిలిపారన్నారు దేశంలో బిజెపి ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి వస్తుందన్నారు అలాగే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పడగొట్టి బిజెపి ప్రభుత్వాన్ని గెలిపించుకునే బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆమె అన్నారు బిజెపి మండల అధ్యక్షుడు అరవింద్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ వల్లే దేశం అని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని రైతులు, మహిళలు, అభివృద్ధి చెందుతున్నారని ఉజ్వల పథకం ద్వారా స్త్రీలకు ఉచితంగా సిలిండర్లు పంపిణీ చేశారని రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, పద్మమ్మ, మంగమ్మ, సుగురు లక్ష్మి మండల ప్రధాన కార్యదర్శి విశాల, అలివేల, భాగ్యశ్రీ, సునీత, జ్ఞానేశ్వరి, అంజనమ్మ, లక్ష్మీ, లావణ్య, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు