Wednesday, 4 November 2026

అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ ఛాంప్‌ విజయవాడ సర్కిల్‌

విజయవాడ స్పోర్ట్స్‌: ఇందిరాగాందీ మున్సిపల్‌ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఏపీ ట్రాన్స్‌కో అండ్‌ ఆస్కం ఇంటర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్‌లో విజయవాడ ఆపరేషన్స్‌ నర్కిల్‌ 33 పాయింట్లతో ఓవరాల్‌ చాంప్‌ను కైవసం చేసుకుంది. పోటీల ముగింపు కార్యక్రమానికి తిరుపతి ఏపీఎస్‌డీ సీఎల్‌ ప్రాజెక్టు డైరక్టర్‌ జెడ్‌. ఫిలివ్స్‌ ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. నిజామాబాద్‌ 24 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా గుంటూరు సర్కిల్‌ 21 పాయింట్లతో 3వ స్థానంలో సాధించింది. ఈ ఛాంపియన్‌ షిప్‌లో విజయవాడ ఆపరేషన్స్‌ నర్కిల్‌కు చెందిన కేవీ నాగులు ఫాస్టెస్ట్‌ అథ్లెట్‌గా ప్రత్యేక బహుమతిని గెలుపొందారు. విజయవాడ ఆపరేషన్స్‌ ఎస్‌ఈ మోహనకృష్ణ ఆధ్యక్షత వహించారు. శావ్‌ ఆర్‌డీడీ చిన్నయ్య, డీఎస్‌డీఓ రామకృష్ణ, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ వెంకటేశ్వరరావు అతిధులుగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *