అథ్లెటిక్స్ జిల్లా స్థాయి సెలక్షన్లో పాటిమట్ల విద్యార్థుల ప్రతిభ
మోత్కూరు నవంబర్ 27 జనంసాక్షి :
జాతీయ అంతర్ జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలో అండర్ 14 , 16 విభాగంలో పాటిమట్ల ఉన్నత పాఠశాలకు చెందిన బాల, బాలికలు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. ఆదివారం భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సెలక్షన్స్ లో అండర్ 16 లాంగ్ జంపింగ్ లో జటంగి శ్రావణి ప్రథమ స్థానం, రాపోలు గణేష్ ద్వితీయ స్థానం, పి.శిరీష తృతీయ స్థానం,60 మీటర్ల పరుగు పందెంలో పి. శిరీష ప్రథమ స్థానం,బి.దీపిక తృతీయ స్థానం సాధించారు. విజేతలను ప్రధానోపాధ్యాయులు అగ్గి రాముడు, వ్యాయామ ఉపాధ్యాయురాలు రామానుజమ్మ, ఉపాధ్యాయులు లింగమల్లు, నాగలక్ష్మి, స్వప్న, కృష్ణ, వీరాచారి, నరేష్, ఉప్పలయ్య కృష్ణవేణి తదితరులు అభినందించారు




