టీఆర్ఎస్ పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలి
— టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్
మోత్కూర్ నవంబర్ 27 జనంసాక్షి : తుంగతుర్తి శాసన సభ్యులు డా. గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశానుసారం సాధారణ ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా పార్టీ కోసం సైనికుల పని చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ అన్నారు. ఆదివారం మండలంలోని ముశిపట్ల, పాలడుగు గ్రామాలలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ సమావేశం బూత్ కమిటీలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొనతం యాకూబ్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు కొండ సోమలు, గ్రామ శాఖ అధ్యక్షులు నిర్లకంటి మచ్చగిరి, మర్రిపెళ్లి చంద్రయ్య, వైస్ ఎంపీపీ బుష్పాక లక్ష్మీ మారయ్య, జిల్లా నాయకులు ఫైళ్ల దయాకర్ రెడ్డి, మండల రైతు విభాగం అధ్యక్షుడు ఫైళ్ల, వెంకటరెడ్డి, మెరుగు యాదగిరి, గ్రామ రైతు బంధు అధ్యక్షుడు సింగిరెడ్డి నరసింహారెడ్డి, పబ్బు బుచ్చి రాములు, బొడిగే వీరయ్య, గనగాని నరసింహ, పులగం వెంకట్ రెడ్డి, కొంపల్లి అంజయ్య, మోత్కూర్ రాజు, నారాయణ, మోత్కూర్ రమేష్, బొడిగే మచ్చగిరి, కొంపల్లి కృష్ణమూర్తి, టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు పబ్బు ప్రవీణ్, సైదులు నకేతు ప్రవీణ్, టిఆర్ఎస్ రెండు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలి




