జనంసాక్షి, కమాన్ పూర్ : తాలు తప్ప పేరిట అదనంగా తూకం వేస్తే ఊరుకునేది లేదని , అవసరమైతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు హెచ్చరించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంగొల్లపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని సైతం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రములో తడిసిన వడ్ల నిల్వలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెద్ద ఎత్తున కాంటాలు ఏర్పాటు చేసి కొనుగోలు వేగవంతం చేసి తక్షణమే రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు, గొల్లపల్లి, పేరపల్లి, గుండారం, రొంపికుంట సర్పంచ్ లు షీలారపు అనిత మల్లయ్య, తొగరి అన్నపూర్ణ అశోక్, ఆకుల ఓదెలు, కటకం రవి, జిల్లా నాయకులు చొప్పరి సదానందం, రంగు సత్యనారాయణ గౌడ్ , భూంపల్లి రాజయ్య, నాయకులు మొండయ్య, తోట చంద్రయ్య, బర్ల శ్రీనివాస్, కటకం నారాయణ, ఎర్రయ్య, గుమ్మడి సతీష్, చొప్పరి శేఖర్, రఫిక్, ఇక్బాల్, కుక్క రవి, బొజ్జ సతీష్, నూనెటి మల్లికార్జున్, పెండ్యాల రాజు, కోలా నర్సాగౌడ్, ఇరుగురాల శేఖర్, పోతుల కుమార్, బిల్ల కృష్ణ, చిక్కుళ్ళ శీను, మామిడి రాజు లతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




