అలంపూర్ మే 5 (జనంసాక్షి )అలంపూర్ పట్టణంలో 6 కోట్ల రూపాయాలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను శుక్రవారం మున్సిపాల్ చైర్మన్ మనోరమ వెంకటేష్ పరిశీలించారు. అక్బర్ పేటలోని 7 వ వార్డు కౌన్సిలర్ సఖినాభిమక్తర్ వార్డులోని వివిధ సంధులను చూపిస్తు ఎక్కడెక్కడ సీసీ రోడ్ల అవసరమో తెలియజేయడం జరిగింది. అనంతరం గ్రామీణ వికాస్ బ్యాంక్ దగ్గర జరుగుచున్న సీసీ రోడ్డునుపరిశీలించారు.ఈసందర్బంగా
కాంట్రాక్టర్లు సీసీ రోడ్లను నాణ్యతగా వేయాలని,చక్కగా క్యూరింగ్ చేయాలని అదేశించారు.
అలంపూర్ పట్టణ ప్రజలు సీసీ రోడ్లు వేయడానికి సహకరించాలని చైర్ పర్సన్ కోరారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ పెద్దమక్తర్, అడ్వాకెట్ వెంకటేష్ ,వర్క్ ఇన్స్ పెక్టర్ లక్ష్మీనారాయణ ,మున్సిపాల్ సిబ్బంది వినోద్ ,బుచ్చన్న మరియు కాలనీవాసులు పాల్గోన్నారు.




