హైదరాబాద్,జూలై13(జనం సాక్షి): షట్లర్ పివి సింధు తనకు అదనపు స్థలం కావానలి చేసిన విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం సున్నితంగా తోసి పుచ్చింది. రియోలో ప్రతిభకు…భరణి లే అవుట్లోని రూ.15 కోట్ల విలువైన 1000 గజాల స్థలం, రూ.5 కోట్ల నగదును టిఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అటు ఎపి ప్రభుత్వం 1000 గజాల స్థలం, నగదు, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగమిచ్చింది. అయితే భరణిలో తన స్థలానికి ఆనుకుని గల 398 గజాల స్థలాన్ని సింధు ఇటీవల కోరగా…2 రాష్ట్రాల నుంచి ప్రయోజనం పొందడంతో ఇక ఏవిూ ఇవొద్దని టిఎస్ సిఎంఓ నిర్ణయించింది. దీంతో ఆమెకు మరింత కోరిన స్థలం ఇవ్వలేమిన తెలిపింది.
అదనపు స్థల విజ్ఞప్తిని తిరస్కరించిన తెలంగాణ




