ప్రభుత్వ రంగ సంస్థల నష్టానికి కేంద్ర ప్రభుత్వం భాద్యత వహిస్తూ ఆర్ధిక శాఖ మంత్రి రాజీనామా చేయాలి.. డా. సత్యం శ్రీరంగం డిమాండ్.కూకట్ పల్లి జనంసాక్షి : అదానీ ఆర్ధిక అవకతవకలపై పార్లమెంటరీ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల నష్టానికి కేంద్ర ప్రభుత్వం భాద్యత వహిస్తూ ఆర్ధిక శాఖ మంత్రి రాజీనామా చేయాలని పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు సోమవారం కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ లోని ఫిరోజ్ గూడా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బ్యాంక్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ సామాన్యుల కష్టార్జిత పొదుపు ఖర్చుతో తన సన్నిహితులకు, ఎంపిక చేసిన బిలియనీర్లకు లబ్ధి చేకూర్చేలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్ భారత దేశం, మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఎల్ఐసి, ఎస్బిఐ వంటి పిఎస్‌యులు మన దేశానికి గర్వకారణమని, కోట్లాది మంది భారతీయులు కష్టపడి సంపాదించిన డబ్బుతో నిర్మించబడ్డాయని అన్నారు. తన ప్రాణ స్నేహితుడికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో మోడీ ప్రభుత్వం అదానీ గ్రూప్‌లో ఎల్ఐసి, ఎస్బిఐ మరియు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడి పెట్టేలా చేసిందని, ఎల్ఐసి అదానీ గ్రూప్‌లో భారీ పెట్టుబడులు పెట్టింది మరియు గత కొన్ని రోజుల్లో 39 కోట్ల మంది పాలసీ హోల్డర్లు, ఎల్ఐసి పెట్టుబడిదారులు 33,060 కోట్లు నష్టపోయారని, ఎస్బిఐ ఇతర భారతీయ బ్యాంకులు అదానీ గ్రూప్‌కు భారీ మొత్తంలో రుణాలు ఇచ్చాయని భారతీయ బ్యాంకులకు అదానీ గ్రూప్ సుమారు రూII 80,000 కోట్లు బకాయిపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క భారతీయ కార్పొరేట్ సంస్థకు వ్యతిరేకం కాదని అన్నారు. అదానీ గ్రూప్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మౌనం వహించడం కుమ్మక్కు కిందకే వస్తుందని అన్నారు. మోడీ ఎప్పుడూ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతానని అంటారు కదా మరి ఆ చిత్త శుద్ధి ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన బిలియనీర్లకు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలను మార్చే ఆలోచనకు వ్యతిరేకం అని, పేదలు, సామాన్యులకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కోట్లాది మంది భారతీయుల కష్టార్జిత పొదుపును ప్రమాదంలో పడేస్తూ మార్కెట్ విలువను కోల్పోతున్న కంపెనీల్లో ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చను పార్లమెంట్లో ప్రారంభించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, నల్లోల రాజేందర్, మధు మోహన్, జావీద్ ఆలీ, విట్టల్ రెడ్డి, కొన్నింటి శామ్యూల్, బంధిగ బాల నర్సింహా, నరసింహ యాదవ్, జ్యోతి, మొయినుద్దీన్, చిటుకోరు క్రిష్ణా, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న కుమార్, మధు గౌడ్, మహేందర్, ముఖేందర్, హేమంత్, జల్లా శివ, సూర్య, శేఖర్ గజానంద్, మాదరి శ్రీను




