Tuesday, 3 November 2026

జిల్లాలో కొనసాగుతున్న బ్రుసెల్లోసిస్ వాక్సిన్ -జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ పి. వెంకటేశ్వర్లు.

 

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 6 (జనం సాక్షి);పాడి రైతులు, పశుపోషకులు జాతీయ ఉచిత బ్రుసెల్లోసిస్ నివారణ కార్యక్రమాన్ని సోమ వారం రోజు కూడా కొనసాగుతుంద ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా పశువైద్య,పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ పి.వెంకటేశ్వర్లు అన్నారు. బ్రుసెల్లోసిస్ అను వ్యాధి పాడిపశువులు, జీవాలు,మేకలు,పందులతో పాటు మనుషులలో కూడా కలుగుతుందని దీని వలన పాడిపరిశ్రమ,మాంస పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. ఇది ప్రమాదకరమైన వృత్తి సంబంధిత (జూనోటిక్) సంక్రమిత వ్యాధి.ఈ వ్యాధి బ్రూసెల్ల అను సూక్ష్మజీవి వలన వస్తుంది. ఈ సూక్ష్మజీవి వృద్ధి చెందటానికి తక్కువ వాతావరణ ఉష్ణోగ్రత, అపరిశుభ్రమైన పరిస్థితులు దోహదపడతాయని తెలిపారు. రైతు సోదరులు తప్పని సరిగా కొత్తగా పుట్టిన ప్రతి ఆడ దూడకు 4-8 నెలల వయస్సు దూడలకు 2 మిల్లి లీటర్ టీకాను ఒక్కసారి ఇవ్వడం ద్వారా జీవిత కాలం వ్యాధి రాకుండ కాపాడవచ్చునాని, గద్వాల జిల్లాలో జనవరి నెల 31 నుండి ఈ నెల 6 వరకు ప్రతి గ్రామంలో టీకాలు వేయబడునని వారు తెలిపారు.జిల్లాలో 14,083 మంది రైతులకు సంబంధించిన దూడలకు 33 బృందాలుగా,185 గ్రామాలలో ,1284 ఆవు దూడలు , 2773 గేద దూడలు, దూడలు మొత్తం 4057 కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు.