Tuesday, 3 November 2026

హాత్​ సే హాత్​ జోడో పాదయాత్ర

 

 

 

 

 

 

రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడమే మా లక్ష్యంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.. పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం.”కూకట్ పల్లి జనంసాక్షి : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని పిసిసి సభ్యులు డాక్టర్ సత్యం శ్రీరంగం అన్నారు. ఏఐసీసీ ఆదేశానుసారం రాహుల్ గాంధీ పిలుపు మేరకు, రేవంత్ రెడ్డి సూచనలతో దేశ వ్యాప్తంగా ప్రారంభమైన హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని సోమవారం కూకట్ పల్లి నియోజక వర్గంలో పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ సందేశాన్ని కూకట్ పల్లి నియోజక వర్గ ప్రజలకి ఇంటింటికీ వెళ్లి తెలియచేస్తామని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి మీద ఛార్జి షీట్ విడుదల చేసిందని, అనేక అబద్దపు వాగ్దానాలు చెప్పి అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం నేటికీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కావొచ్చు, నిరుద్యోగ భృతి కావొచ్చు ఇవన్నీ కూడా చాలా మంది లబ్ధిదారులకు చేరలేదని తెలియచేసారు. అదేవిధంగా దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్ముకుంటూ, కేవలం మతం ఆధారంగా దేశాన్ని విచ్చిన్నం చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని ఆ ప్రయాత్నాలకి ప్రజలని చైతన్య వంతం చేయాలని చెప్పి భారత్ జోడో యాత్ర, హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ఒక ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, నల్లోల రాజేందర్, మధు మోహన్, జావీద్ ఆలీ, విట్టల్ రెడ్డి, కొన్నింటి శామ్యూల్, బంధిగ బాల నర్సింహా, నరసింహ యాదవ్, జ్యోతి, మొయినుద్దీన్, చిటుకోరు క్రిష్ణా, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న కుమార్, మధు గౌడ్, మహేందర్, ముఖేందర్, హేమంత్, జల్లా శివ, సూర్య, శేఖర్ గజానంద్, మాదరి శ్రీను, భరత్, పుట్టపాక మధు, చంటి సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.