
న్యూఢిల్లీ: ఇతర విమాన సంస్థల మాదిరిగానే స్పైస్‌జెట్ కూడా టికెట్ ధరల్లో డిస్కౌంట్ల బాట పట్టింది. ప్రయాణికుల కోసం ప్రారంభ ధర రూ. 599కే (అన్ని పన్నులతో కలిపి) అందుబాటులో ఉంచినట్టు తాజాగా బుధవారం ప్రకటించింది. ఈ ఏడాదిలో వచ్చిన చీపెస్ట్ ఆఫర్ అని వెల్లడించింది. ఈ ఆఫర్ టికెట్లను ఈనెల 11, 13 తేదీల్లో మాత్రమే విక్రయిస్తున్నట్టు పేర్కొంది. ప్రయాణికులు ఈ టికెట్లతో జూలై 1 నుంచి అక్టోబర్ 24 వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది.
సూపర్ అమ్మకాల ద్వారా సంస్థ ఆదాయం పెరుగుతుందని స్సైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కనేశ్వరన్ అవిలి చెప్పారు. ప్రయాణికులకు రైళ్లు, బస్సు ప్రయాణాలతో పోలిస్తే విమాన ప్రయాణం ఇంకా సులభతరం చేయటం కోసమే ఇలాంటి ఆఫర్లను ప్రకటించామని తెలిపారు.
దేశీయ నెట్‌వర్క్‌లో కనిష్ట ధర నుంచి విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నామని అవిలి తెలిపారు. జనవరి – మార్చి, జూలై – సెప్టెంబర్ ప్రయాణాల ఆఫర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ యాజమాన్యం మారుతున్న నేపథ్యంలో స్పైస్‌జెట్ నుంచి వస్తోన్న ఆఫర్ ఇదని పేర్కొన్నారు. గత నెలలో తమ దేశీయ నెట్‌వర్క్ రూట్లలో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేశామని గుర్తు చేశారు. ఆ ఆఫర్‌కు మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. ఈ ఉత్సాహంతోనే తాజాగా రూ.599 ఆఫర్‌ను అందిస్తున్నామని వివరించారు.




