Wednesday, 4 November 2026

అద్భుతపాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌: మంత్రి హరీశ్‌

 రావుఅద్భుతపాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌: మంత్రి హరీశ్‌ రావు
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌ రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితర సాధ్యుడని అన్నారు. సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన శేఖరుడని చెప్పారు. కేసీఆర్‌ అంటే కారణజన్ముడిగా, చిరస్మరణీయుడిగా, ప్రజల తలరాతలను మార్చే మహనీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.‘సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు..తెలంగాణ ప్రజలకు స్వేఛ్చా వాయువులు ప్రసాదించినa శేఖరుడు..కాళేశ్వర గంగను దివి నుంచి భువికి దించిన అపర భగీరథుడు..తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు..అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు.‘కేసీఆర్ అంటే కారణజన్ముడుగా… చిరస్మరణీయుడుగ ప్రజల తల రాతలను మార్చే మహనీయుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలి..! గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.