అద్వానీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మోడీ

గాంధీనగర్‌: భాజపా కీలకపదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించు కోవాలన్న అద్వానీ నిర్ణయాన్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ స్వాగతించారు. భాజపాలోని లక్షలాది కార్యకర్తలను నిరుత్సాహపరచకుండా అద్వానీ నిర్ణయం తీసుకోవడం పై ఆయన ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.