అధికారంలో కొనసాగే నైతిక హక్కు యూపీఏ కోల్పోంయింది

-భాజపా నేత సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వంలో కొత్త కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని విపక్షనేత సుష్మాస్వరాజ్‌ ఆరోపించారు. లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. అరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. 2జీ కుంభకోణంపై జీపీసీ నివేదికను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుందని ధ్వజమెత్తారు. బొగ్గుకుంభకోణంపై దర్యాప్తు వివరాలను సీబీఐ నుంచి ప్రభుత్వం తెలుసుకుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇంతటి అవినీతి ప్రభుత్వం ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. అధికారంలో కొనసాగే నైతిక హక్కు యూపీఏ ప్రభుత్వం కోల్పోయిందని అన్నారు.