దండేపల్లి జనం సాక్షి ఏప్రిల్ 10 తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దండేపల్లి మండల ఐకెపి వివోఏలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం తహసిల్దార్ హన్మంతరావు. ఎంపీడీవో మల్లేశం మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యలను విన్నవించుకోవడం జరిగింది తమ డిమాండ్లను ప్రభుత్వం చర్యలు తీసుకునేలా నివేదికలు అందించాలని కోరారు అనంతరం ఐకెపి వివో ఎలా అధ్యక్షురాలు బొలిశెట్టి అనంతలక్ష్మి మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండ గ్రామాలలో పేద మహిళలను సంఘాలు గా ఏర్పాటు చేసి బ్యాంకు నుండి రుణాలు ఇప్పించడం ప్రభుత్వం నుండి వచ్చిన పథకాలను మహిళలకు అందించడం బుక్కులను రాయడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత కనీస వేతనం26000 వేల తోపాటు పిఆర్సి వర్తింప చేయాలి గౌరవేతనం నేరుగా తమ వ్యక్తిగత ఖాతాలోకి జమ చేయాలని సెర్ప్ ద్వారా ఐడి కార్డులు మంజూరు చేయాలని సాధారణ మరియు ప్రమాద బీమా 20 లక్షలు అర్హత కలిగినవారికి సీసీలుగా ప్రమోట్ చేయాలని ఆరోగ్య భీమా 10 లక్షల వరకు జీవో నెంబర్ 58 ని సవరించి అనేక్సర్ 5 ను రద్దు చేసి ఎస్ఐజి లకు రావలసిన 3500 కోట్లు వడ్డీ లేకుండా రుణాలు చెల్లించాలి అభయహస్తం ప్రీమియం వడ్డీతో కలిపి సంఘాలకు చెల్లించాలి స్త్రీని నుంచి వచ్చే ఇన్సెంటివ్ను వివోఏలకు వ్యక్తిగత ఖాతాలో జామ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కొప్పుల లింగయ్య ప్రధాన కార్యదర్శి బద్రి సత్తన్న కోశాధికారి బొలిశెట్టి విజయ సభ్యులు వెంకటలక్ష్మి ముత్యం శ్రీనివాస్ ముత్యం తిరుపతి ఏసన్న మల్లేష్ తదితరులు పాల్గొన్నారు




