రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 10. (జనంసాక్షి). మంత్రి కేటీఆర్ పర్యటనకు వస్తుండని ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేయడం పై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు. తంగళ్ళపల్లి మండలం ఆరు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఈ విషయాలను యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజలుకు కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం జరిగిందని అన్నారు. మంత్రిని అభివృద్ధి పై ప్రశ్నిస్తారనే నేపంతోనే కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారని మండిపడ్డారు. మంత్రి వచ్చినప్పుడల్లా అరెస్టు చేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అవుతుందో మంత్రి చెప్పాలని అన్నారు.




