Wednesday, 4 November 2026

అధికారులకు వినతి పత్రాలు అందజేసిన రజక సంఘం నాయకులు.

 

 

 

 

 

శంకరపట్నం జనం సాక్షికరీంనగర్ జిల్లా కేశవపట్నం బస్టాండ్ ఎదుట విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని ,మండల అధికారులకు తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలను అందజేసినట్లు తెలంగాణ రజక సంఘం శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడు తాడిచర్ల తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో కేశవపట్నం బస్టాండ్ ఎదుట
జాతీయ రహదారిపై తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ సమీపంలో ఓ కుల సంఘం నాయకులు, ఆ కుల సంఘం మండల నాయకుల విగ్రహ ఏర్పాటుకు సోషల్ మీడియాలో భూమి పూజ చేయడం జరుగుతుందని, పోస్టులు పెట్టారని అట్టి పోస్టులను స్పందించి, శంకరపట్నం తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావుకు కేశవపట్నం ఎస్ఐ దేశ్ చంద్రశేఖర్ కు, ఎంపీడీవో కు బస్టాండ్ ఎదుట ప్రజలకు ,ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని, టి ఎస్ ఆర్ టి సి బస్సులు బస్టాండ్ లోకి వెళ్లాలంటే, బయటకు రావాలంటే, ఇబ్బందులు ఉన్నాయని, విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని రజక సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలను అందజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో