Wednesday, 4 November 2026

రైతులకు కరెంటు కష్టాలు తీర్చాలి

 

 

 

 

 

 

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 8దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ కరెక్ట్ కష్టాలను తీసుకువచ్చారని రైతుల కరెంట్ కష్టాలను తీర్చాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బుధవారం శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకముగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ శంకరపట్నం మండల మాజీ ఉపాధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జ్ అన్నాడి మహేందర్ రెడ్డి, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు పల్లె శివారెడ్డి, మాట్లాడారు. తెలంగాణలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్టు చేస్తూ తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని పత్రికా ప్రకటనలు చేసుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో రైతులకు గత నెల రోజుల నుండి కరెంటు కష్టాలు వర్ణాతితంగా ఉన్నాయని రైతులకు సమయానికి విద్యుత్తు అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ విధంగా వ్యక్తం చేశారు. వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా ప్రభుత్వము పాలకులు స్పందించి సమయానికి విద్యుత్తు సరఫరా చేసి వేసిన పంటలు వెళ్లకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారము తెలుసుకున్న కేశవపట్నం ఏఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ రామచంద్రం సిబ్బందితో ధర్నాస్థలం చేరుకొని ధర్నా కార్యక్రమాన్ని విరవింపజేశారు. ఈ కార్యక్రమములో బీజేపీ నాయకులు పల్లె శివ రెడ్డి,రేమిడి రాజిరెడ్డి,కట్కూరి ప్రభాకర్ రెడ్డి,కోమల్ రెడ్డి,తిరుపతి రెడ్డి,నిమ్మశెట్టి సంపత్,తిరుపతి, పుదరి తిరుపతి,చింతల సురేష్,బడుగు రవి,మహేందర్ రెడ్డి,దున్నపోతుల కుమార్,ఉమ్మెంతల శ్రీనివాస్ రెడ్డి,కేశవేణి సది,మల్లేష్,మునిగంటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.