డోర్నకల్ ఫిబ్రవరి-8/జనం సాక్షి న్యూస్:డోర్నకల్ మండలం తాసిల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నల్ల బ్యాడ్జిలతో నిరసనలు తెలిపిన వీఆర్ఏలు.కామారెడ్డి జిల్లా దోమకొండ కార్యాలయంలో వీఆర్ఏ గా విధులు నిర్వహిస్తున్న మన్నె దేవరాజు,పే స్కేల్ హామీ అమలు కాదని మనస్థాపానికి ఆత్మహత్య చేసుకున్న దేవరాజు ఆత్మకు శాంతి కలగాలని,నల్ల బ్యాడ్జి మౌనం పాటించారు.ఈ సందర్భంగా డోర్నకల్ వీఆర్ఏ జేఏసీ చైర్మన్ ఆలేటి బాలకృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్యం ఇంకా ఎంతమంది వీఆర్ఎలు ఆత్మబలిదానాలు చేసుకుంటే స్పందిస్తారు అని ఘాటుగా విమర్శించారు.బడ్జెట్లో విఆర్ఏ ప్రస్థానం లేకపోవడం సిగ్గుచేటుగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల వీఆర్ఏ లు డానియాలు, శేఖర్, సాయిరాం, గోపరాజ్, మాదవి, దివ్య, భారతి, సృజన, మాధవి, కవిత, సతీష్, తదితరులు పాల్గొన్నారు




