Thursday, 5 November 2026

అధికారులు చర్యలు తీసుకోవాల0టు ఆర్డీఓ, తహసిల్దార్ కి వినతి పత్రం

స్టోన్ క్రషర్ తో మా ఇ0డ్లు క0పిస్తూన్నాయి…

– అధికారులు చర్యలు తీసుకోవాల0టు ఆర్డీఓ, తహసిల్దార్ కి వినతి పత్రం…
బైంసా రూరల్ డిసెంబర్ 05, జనం సాక్షి

 

స్టోన్ క్రషర్ వలన మా ఇ0డ్లు కదులుతున్నాయి,మా పిల్లలు భయపడుతున్నార0టూ బై0సా మండలం చింతల్ బోరి గ్రామస్తులు సోమవారం ఆర్డిఓ రవి కుమార్, తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందించారు.తమ గ్రామ శివారులో ఈనెల మూడవ తేదీన పది గంటల సమయం లో స్టోన్ క్రషర్ వాళ్ళు స్టోన్ బ్లాస్ట్ చేయడంతో ఇండ్లలోని వస్తువుల కింద పడిపోవడం, పిల్లలు భయపడడం జరిగిందని, అంతేకాకుండా 20 ఫీట్ల కన్నా ఎక్కువ లోతు మైనింగ్ చేస్తున్నారని, వారికి కేటాయించిన హద్దుల్లోనే మైనింగ్ చేయాల్సి ఉండగా హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం అందించిన వారిలో గ్రామ సర్పంచ్ కిషోర్, గ్రామస్తులు ఉన్నారు