వైద్య రంగ అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి
:ఎంపీపీ బోడ మంగీలాల్ …
ఖమ్మం జిల్లా.(డిసెంబర్05) జనంసాక్షి.తిరుమలాయపాలేం. తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగా అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆశ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనీ వారికి రాష్ట్రప్రభుత్వం సహకారంతో 40 మందికి యునిఫాం పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగ అభివృద్ధి కోసం అనేక సదుపాయాలు, సౌకర్యాలను కల్పిస్తున్నాయని, కార్పొరేట్ ప్రైయివేటు రంగాలకు అనుగుణంగా ప్రభుత్వ రంగాల అభివృద్ధి కోసం నూతన భవనాన్ని నిర్మించి మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తుందని, కెసిఆర్ కిట్టు, ప్రతి గ్రామాలలో అంగనవాడి కేంద్రాలను ఏర్పాటు చేసి దాంట్లో పౌష్టికాహారాలను* ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోండబాల వేంకటేశ్వర్లు,కోక్కీరేణీ ఎంపీటీసీ సభ్యులు. అంబేద్కర్,వైధ్యాధికారులు రామారావు,పావని,వసుంధర,అయాలు,ఎ ఎన్ ఏం లు,ఉపేందర్, జగధిశ్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య రంగ అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి




