Tuesday, 3 November 2026

అధికారులు ప్రజలు గ్రీవిన్స్ లో ఇచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

అధికారులు ప్రజలు గ్రీవిన్స్ లో ఇచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
-కలెక్టర్ కె.శశాంక
-అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్

మహబూబాబాద్ బ్యూరో-జనవరి 2(జనంసాక్షి)

ప్రజలు అందజేసిన విజ్ఞప్తులను సంబంధిత అధికారులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక తెలియజేశారు. సోమవారం గ్రీవెన్స్ డే పురస్కరించుకొని కలెక్టరు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యు అదనపు కలెక్టర్ తో కలిసి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల రవి ప్రభుత్వం ద్వారా దళిత బంధుకు ఎంపిక చేసి లబ్ధి చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. నెల్లికుదురు మండలం అబ్బాస్ గ్రామంకు చెందిన గొట్టిముక్కల రాంరెడ్డి తమ ఇండ్ల వెంబడి మురుగునీరు ప్రవహిస్తూ దుర్గంధంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని సమస్య పరిష్కారం చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డోర్నకల్ మండలం కన్నెగుండ్ల వాసి A. వీరయ్య సర్వే నెం.136/11 లో గల తన పేరు మీద గల భూమిని రికార్డులో నమోదు చేసి పాసుపుస్తకము ఇప్పించగలరనివిజ్ఞప్తి చేశారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి ( 82 ) దరఖాస్తులు వచ్చాయి. ఈ గ్రీవిన్స్ లో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.