Tuesday, 3 November 2026

వేగంగా నిర్మాణం అవుతున్న వెంకటరత్నాపూర్ బ్రిడ్జి

వేగంగా నిర్మాణం అవుతున్న వెంకటరత్నాపూర్ బ్రిడ్జి

తూప్రాన్ జనం సాక్షి జనవరి 2:: తూప్రాన్ మున్సిపల్ కేంద్రం నుండి వెంకటరత్నపూర్ గ్రామం కు వెళ్లే దారిలో హల్దీ వాగుపై ఏడు కోట్లతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి

గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన బ్రిడ్జి పనులు పునర్ ప్రారంభంలో భాగంగా చాకచక్యంగా పనులు కొనసాగిస్తున్నారు. వెంకటరత్నాపూర్ గ్రామ సమీపంలోని హల్దీ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి ప్రాజెక్టు 7. కోట్ల నాబార్డు నిధులతో అప్పట్లో పనులను ప్రారంభించారు. కొన్ని కారణాల వల్ల నిలిచి ఉన్న పనులను గత రెండు నెలల నుండి చాకచక్యంగా కొనసాగిస్తున్నారని వెంకట రత్నాపూర్ గ్రామ సర్పంచ్ వెంకటరామిరెడ్డి వివరించారు. పనులను ఇంకో రెండు నెలలు పూర్తి చేస్తారని సంబంధిత కాంట్రాక్టర్లు తెలపడం జరిగిందని ఈ బ్రిడ్జి పూర్తయితే తూప్రాన్ నుండి ఆబోతుపల్లి మీదుగా వెంకటరత్నాపూర్ గ్రామానికి వెళ్ళవచ్చు ఈ బ్రిడ్జి వల్ల వెంకట రత్నాపూర్ ఇస్లాంపూర్ పల్లి మల్కాపూర్ దాతర్ పల్లి గ్రామాలు వెళ్లేవారికి నాలుగు నుండి ఆరు కిలోమీటర్లు పేన దూరం తగ్గుతుందని ఆయన తెలిపారు బ్రిడ్జి వల్ల ప్రజలకు ఊరట కలుగుతుందని ఇదివరకు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడిన గ్రామ ప్రజలకు ఇది సౌకర్యంగా ఉంటుందని సర్పంచ్ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. గతంలో గ్రామ ప్రజలు ఏదైనా పని నిమిత్తము తూప్రాన్ కు రావాల్సి వస్తే చుట్టూ ఆరు కిలోమీటర్లు తిరిగే తూప్రాన్ వచ్చేవారని పాఠశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఉండేవని వృద్ధులకు వ్యవసాయదారులకు చాలా ఇబ్బందికరంగా ఉండేదాన్ని గ్రామ సర్పంచి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇప్పుడు బ్రిడ్జి పనులను కొనసాగిస్తున్నారని మా గ్రామ ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే మల్కాపూర్ నుండి వచ్చే వాహనదారులకు చుట్టు తిరగాల్సిన అవసరం ఉండదని వారి సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వార్డు నెంబర్ నవీన్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు