అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేయాలి
జహీరాబాద్ జనవరి 7 (జనం సాక్షి )అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేయాలి అని ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శనివారం మండల సర్వసభ్య సమావేశం లో పాల్గొన్న సందర్బంగా ఎమ్మెల్యే వివిధ శాఖ ల వారిగా ప్రజాసమస్యలు వాటి పరీక్షణ కోరుకు తీసుకునే చర్యలను అడిగి తెలుసుకున్నారు.
పలు గ్రామాల ఎంపిటీసీ లు, సర్పంచులు ఎమ్మెల్యే కు గ్రామాల సమస్యలు తెలుపుగా సమస్యల ను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశం లో మండల అభివృధి అధికారి సుమతి, తహసీల్దార్ స్వామీ, ఎంపీపీ, జడ్పీటిసి, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వివిధ శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం తో పనిచేయాలి




