రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్దన్ తొలగింపుకు
ప్రణాళికలు సిద్దం చేయాలి
-ఏరియా జిఎం ఐత మనోహర్
యైటింక్లయిన్ కాలని జనవరి 07( జనంసాక్షి):
రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్దన్ తొలగింపుకు
ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని జిఎం ఐత మనోహర్ ఓబీ గుత్తెదారులకు సూచించారు. శనివారం గుత్తేదారులతో జీఎం చాంబర్ లో సమీక్షా సమావేశము నిర్వహించారు. ఓసిపి-3 ఓబీ ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతున్న క్రమములో ఓసిపి-3 ఓబీ పనులు నిర్వహిస్తున్న సుశీ ఇంఫ్రా, ఆర్విఆర్ సాయి ప్రణవ్ గుత్తేదారులు రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్దన్ తొలగించుటకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. వార్షిక లక్ష్యాలు సాధించే విధంగా ప్రమాదరహితంగా, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలన్నారు. అలాగే యంత్రాలలో ఉండవలసిన రక్షణ పరికరాలు సరిగా పని చేసే విధంగా చూసుకోవాలని గుత్తెదారులకు సూచించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ అధికారి జీ. మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజినీర్ దుర్గాప్రసాద్, డిజిఎం వర్క్ షాప్ ఎర్రన్న, డిజిఎం (పర్సనల్), అధికార ప్రతినిధి జి.రాజేంద్రప్రసాద్, గని మేనేజర్ డి.రమేష్, సుశీ ఇంఫ్రా, ఆర్విఆర్, సాయి ప్రణవ్ ప్రతినిధులు పాల్గోన్నారు.
రోజుకు 50 వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్దన్ తొలగింపుకు




