లేడిస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా బొమ్మల కొలువు లేడిస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా బొమ్మల కొలువు యైటింక్లయిన్ కాలని జనవరి 07(జనం సాక్షి): ఆర్జీ-2 ఏరియా లేడిస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్ సిఓఎ క్లబ్ నందు శనివారం ఆర్జీ-2 ఏరియా సేవా అధ్యక్షురాలు ఐత సవితా మనోహర్ అద్యక్షతన “బొమ్మల కొలువు” ను వైభవంగా ఏర్పాటు చేయడం జరిగినది. ఆర్జీ-2 ఏరియా లేడీస్ అధ్యక్షురాలు ఐత సవితా మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమములో ఎస్.పల్లవి- చంద్ర శేఖర్, ముఖ్య అతిధిగా పాల్గొనగా విశిష్ట అతిధులుగా పద్మ నారాయణ, శ్రీదేవి వెంకటేశ్వర్ రావ్ , కళ్యాణి శ్రినివాస్, పద్మ వెంకటేశ్వర్లు, మాలతీ సూర్య నారాయణ, కెవి రావు, జయశ్రీ సాంబయ్య పాల్గోన్నారు. హాజరైన అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి, కొబ్బరి కాయలను కొట్టి అమ్మవారికి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ బొమ్మల కొలువులో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా అమ్మవారులు, సంక్రాంతి లక్ష్మి, గొబ్బెమ్మలు, బోగి మంటలు, బతుకమ్మ, సమ్మక్క సారక్క జాతర, బృందావనం, వన్య ప్రాణులను సంరక్షించడం, వినాయకుడు, అల్లూరు గ్రామం, పల్లె వాతావరణం అనే వివిధ రకాల అంశాలపై అవగాహన కలిగేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. “బొమ్మల కొలువు” నిర్వహించటం వలన అందరికీ మంచి జరుగుతుందని, దుర్గ మాతాకు మంగళ హారతులు ఇచ్చి అమ్మ దీవెనలు అందరి మీద ఉండాలని కోరారు. ప్రతి ఏటా నిర్వహించే “బొమ్మల కొలువు” ఎంతో రమ్యంగా ఉంటుందని ఎస్.పల్లవి- చంద్ర శేఖర్ అన్నారు.ఆర్జీ-2 ఏరియా సేవా అధ్యక్షురాలు ఐత సవితా మనోహర్ మాట్లాడుతూ బొమ్మల కొలువును విజయ వంతం చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియ జేశారు. ముఖ్య అతిధి పల్లవి – చంద్ర శేఖర్ ని శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహువానితులను తఎంత గానో అలరించాయి. ఈ కార్యక్రమములో లేడిస్ క్లబ్ సెక్రెటరి శారద, సభ్యులు ప్రభ, లతా, పుష్పా, సుజనా, జ్యోతి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.
లేడిస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా బొమ్మల కొలువు




