Wednesday, 4 November 2026

అధికారులు సక్రమంగా పనులు చేయడం లేదని మండల సభలో సభ్యులు గరం గరం విధులు సక్రమంగా నిర్వర్తించని అధికారులపై చర్యలు తీసుకుంటాం ఎంపీపీ చంద్రకళ

వికారాబాద్ రూరల్ జూలై 7 జనం సాక్షి
ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో సక్రమంగా పనులు చేయడం లేదని ప్రజాప్రతినిధుల మాట సైతం వినుకొండ ఇష్టాను రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని మండల సభలో సభ్యులు గరం గరం అయ్యారు శుక్రవారం వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలువురు సర్పంచులు ఎంపిటిసిలు విద్యుత్ అధికారులపై మిషన్ భగీరథ అధికారులపై గ్రామీణ అభివృద్ధి అధికారులపై నిరుచుకుపడ్డారు దీంతో ఎంపీపీ చంద్రకళ కల్పించుకొని విజువల్స్ సక్రమంగా నిర్వర్తించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు ఆర్ అండ్ బి అధికారులు రోడ్లు కల్వర్టులు సక్రమంగా నిర్మించకుండా ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చేసి పెడుతున్నారని పనుల్లో నాణ్యత లేకున్నా పట్టించుకోకపోవడం విచారకరమని పలువురు ఆరోపించారు సంబంధిత అధికారులు కల్పించుకొని ఇకనుండి పనులు నాణ్యతను పరిశీలించి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య మండల కో ఆప్షన్ సభ్యులు ఎర్రవల్లి జాఫర్ సర్పంచులు సుభాన్ రెడ్డి బౌసోద్దీన్ వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు పాల్గొన్నారు