Wednesday, 4 November 2026

బీజేపీ నిరంకుశ పరిపాలన కు పుట్ట గతులండవు : జైపాల్ రెడ్డి

శామీర్ పేట్, జనం సాక్షి :
బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఏ ప్రభుత్వం రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేపించాలనే దురుద్దేశంతో కోర్టులలో తప్పులు కేసులు పెట్టి వారి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేపించేలా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నందుకు నిరసనగా,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో,టీపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి,శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ గౌడ్ ఆధ్వర్యంలో తూంకుంటలో రాజీవ్ రహదారి పైన నిరసన తెలిపి అనంతరం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మురళి గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు హరిగోపాల్,శామీర్ పేట్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బిక్షపతి,శామీర్ పేట్ మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బిక్షపతి,శామీర్ పేట్ మండల కాంగ్రెస్ ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి రాజు,మున్సిపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ్ చందర్ యాదవ్,దుర్గయ్య,బాల్ రాజు,నర్సింగ్ యాదవ్,సుధాకర్ యాదవ్,మహేశ్,మున్సిపల్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేష్,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ రెడ్డి,తూంకుంట 1 వ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్,పోతాయిపల్లి 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బల్వంత్ రెడ్డి,పోతాయిపల్లి 15 వ వార్డు కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు రాజు యాదవ్,పోతాయిపల్లి 15 వ వార్డు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్,యూత్ కాంగ్రెస్ నాయకులు కొండల్ రెడ్డి,మణిదీప్ రెడ్డి,సంతోష్, తదితరులు పాల్గొన్నారు.