బిచ్కుంద జూన్ 01 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల హజ్గుల్ గ్రామంలో ఎలాంటి అనుమతి లేకుండా ఈత కొలనూ కొనసాగుతుంది. గ్రామ సమీపముగా ఉండడంతో గ్రామ యువకులు చుట్టు పక్కల గ్రామాల నుండి నిత్యము ప్రతి రోజు పదుల సంఖ్యలో వేసవి కాలం కావడంతో స్విమ్మింగ్ పూల్ లో సేదదీర్చుచున్నారు. కానీ గంటకు సుమారు 100 రూపాయలు కండీషన్ పెట్టడమే గాకుండ ఈత కొట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడానికి ట్రేనర్ కూడా లేకపోవడంతో యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అనుమతి తీసుకోవాలని చెప్పినా సదరు యజమాని అనుమతి తీసుకోకుండా బాధ్యత రహితంగా స్విమ్మింగ్ పూల్ నడిపీయడం సబబు కాదని జనం ఆగ్రహము వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఈత కొలనూకు అనుమతి లేదని, సర్పంచ్ ఈత కొలనూకు అనుమతి ఉందని మండల పరిషత్ అధికారికి చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పందించకపోవడంతో జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడి సదరు ఆ గ్రామ సర్పంచ్ మరియు యజమానిపై విచారణ చేపట్టాలని జనం కోరుతున్నారు.
అధికారుల అలసత్వం… అనుమతి లేకుండా నడుస్తున్న స్విమ్మింగ్ పూల్




