Tuesday, 3 November 2026

నామిని ఆధార్ కార్డు జీరాక్స్ అందజేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సూర్యాపేట పట్టణ పరిధిలోని గీత కార్మికులు వారి నామిని ఆధార్ కార్డ్ జీరాక్స్ ను త్వరితగతిన సూర్యాపేట కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘ కార్యాలయంలోని గీతా భవన్ లో నేటి లోగా అందజేయాలని సూర్యాపేట కల్లుగీత కార్మిక సంఘం ఉపాధ్యక్షులు గుణగంటి కృష్ణ గౌడ్ గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల శ్రేయస్సు కోసం గీతన్న భీమా పథకం ప్రవేశపెట్టిందని, దీనికి గాను ప్రతి గీత కార్మికులు వారి నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్ , సొసైటీ గుర్తింపు కార్డు నెంబర్, వారి సెల్ నెంబర్ అందజేయాలని తెలిపారు. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు అందజేస్తుందన్నారు.ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.పూర్తి వివరాలకు తన సెల్ నెంబర్ 9290666710 సంప్రదించాలని తెలిపారు.