Tuesday, 3 November 2026

అధికారుల అశ్రద్ధ వల్లే ధాన్యం తరలింపు ఆలస్యం

ఏటూరునాగారం జనం సాక్షి,మే30.
రబి సీజన్ కోతల మొదలుపెట్టి నెల రోజులు దాటినప్పటికీ దాన్యాన్ని మిల్లులకు తరలించడంలో అధికారుల అశ్రద్ధ వల్లే నని సిపిఎం మండల కార్యదర్శి దావూద్ రైతులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ 50% దాన్యం కూడా తరలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకవైపు వేసవి తీవ్రత మరొకవైపు వర్షాకాలం ప్రారంభంతో రైతులు అల్లాడుతుంటే లారీలు మిల్లుల వద్ద కాళీ కావడం లేదని వంకతో లారీల కొరత ఏర్పడి ఈరోజు ఉదయం కురిసిన అకాల వర్షంతో రైతులు దిగాలు చెందుతున్నారని, ఆరుకాలం పండించి చేతికి వచ్చిన పంట చేయి జారిపోతుందేమోనని దావూద్ అధికారుల నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు.
వెంటనే కలెక్టర్ ప్రత్యేక దృష్టి రైతులపై సారించి లారీల కొరతను నివారించి రైతులను ఆదుకోవాలని దావూద్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో వసంత మహేష్, చిక్కుల విజయ్, జనగం లక్ష్మయ్య, కుమ్మరి సమ్మయ్య, గోగు బాబు, కుమ్మరి రమేష్, కొండ గొర్ల రంజిత్, కొండ గొర్ల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.