అలంపూర్ మే30 జనంసాక్షిఅలంపూర్ మండలం కోనేరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మధు ఆహ్వానం మేరకు కోనేరు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఎల్లమ్మ అమ్మవారి వేడుకులకు మంగళవారం మంద జగన్నాధం హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు.అనంతరంమనోపాడ్ గ్రామ మాజీ సర్పంచ్ గొల్ల వెంకట్రాముడు ఆహ్వానం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు జములమ్మ అమ్మవారి వేడుకులకు హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించి వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అలంపూర్ మండల జడ్పీటీసీ ఇస్మాయిల్ , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంజి , జోగుళాంబ గద్వాల జిల్లా యువ నాయకులు ఏకాంత్ ,హుస్సేన్ , రఘు , రఫీ , నాగేష్ , మహీందర్ , రవి, జానీ, శివ తదితరులు పాల్గొన్నారు.
జములమ్మ వేడుకులకు హాజరైన మాజీ ఎంపి మంద జగన్నాథ్




