మిర్యాలగూడ, జనం సాక్షి.పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 25 నుండి నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్, నియోజకవర్గ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి మంగళ శాసనములతో ఏర్పాటు చేయబడ్డ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. దైవ సన్నిధిలో తన వంతు గా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నమన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ ఒకటో తేదీన ఆలయ ప్రాంగణంలో పండితులతో నిర్వహించే సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు. అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న బి ఎల్ ఆర్




