Wednesday, 4 November 2026

అధికారుల ఆదేశాలు బేఖాతర్

 

డోర్నకల్ జనవరి 25 జనం సాక్షి

పట్టణ ప్రధాన వీధులలో ఇరువైపులా డ్రైనేజీల ఆక్రమణలు,ప్రజల ఇబ్బందులను జనం సాక్షి పత్రిక ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది.దీంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సిబ్బందిని ఆదేశించారు.బుధవారం తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టిన అధికారులకు ఆక్రమణ దారులు అడ్డు తగిలినప్పటికీ డ్రైనేజీలపై ఉన్న తోపుడు బండ్లు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు,టీ స్టాల్ తొలగించారు.అధికారుల ఆదేశాలు బేఖాతర్ చేస్తూ తొలగించిన గంటల వ్యవధిలోనే తిరిగి యధా స్థానంలో ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.ఇట్టి తీరుపై అధికారులు కఠినంగా వ్యవహరించినట్లు సమాచారం.