Wednesday, 4 November 2026

సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు – లబ్ధిదారులకు

ఒక కోటి ఒక లక్ష 38 వేల రూపాయల చెక్కులు పంపిణీ – ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి
– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్ నగర్ జనవరి 25 (జనంసాక్షి): సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుందని, ఆపద సమయంలో ఆదుకుంటుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన 194 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన 1,0,1,38,000 (ఒక కోటి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయల) చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేతులు మీదుగా అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఆపదలో సీఎం సహాయ నీది ఆపద్భందువునిగ అదుకుంటుందని తెలిపారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుంది, బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినిమెాగపర్చుకొవాలన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. మేళ్లచెరువు జాతరకు గవర్నమెంట్ ఫండ్ 50 లక్షలు, జాన్ పహాడ్ దర్గా జాతరకు 50 లక్షలు నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. జాన్ పహాడ్ దర్గా జాతర 27వ తారీకు, మేళ్లచెరువు జాతర ఫిబ్రవరి 18 నుండి 22 మధ్యలో ఉంటుందన్నారు. ఈ జాతరకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రావచ్చునని తెలిపారు. ఈ జాతరలో ఆకర్షణీయంగా ఎద్దుల పందాలు నిర్వహిస్తారని, గెలిచిన వారికి కోటి రూపాయలతో బహుమతుల రూపంలో అందజేస్తారన్నారు. ఈ జాతరలకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని, జాతరను ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.