Wednesday, 4 November 2026

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

హుజూర్ నగర్ జనవరి 25 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పలు కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. బుధవారం పట్టణంలోని 15 వ వార్డులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నిమిశకవి రామకృష్ణ కుటుంబానికి రెండు లక్షల రూపాయల పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. 14 వ వార్డు నందు ఇటీవల చనిపోయిన అమరబోయిన కామయ్య కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అంద చేశారు. 14 వ వార్డులో అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న కుడిశెట్టి ఇర్మియ కుటుంబాన్ని పరామర్శించారు.
15వ వార్డులో అనారోగ్యంతో చనిపోయిన సంగెపు అంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 11వ వార్డు లో ఇటీవల చనిపోయిన కస్తాల సుకన్య కుటుంబాన్ని పరామర్శించి 10,000 ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.