Thursday, 5 November 2026

ఆర్ ఆర్  ఆర్ ప్రారంభించిన కార్పొరేటర్ ఉమా దామోదర్

వరంగల్ ఈస్ట్, మే 20 (జనం సాక్షి) 38 వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్ గారు    మున్సిపల్ సిబ్బందితో కిలా వరంగల్ పడమరకోట చమన్ వద్ద   “రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ (ఆర్ ఆర్ ఆర్) ప్రారంభించడం జరిగింది. అనంతరం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ప్రజలందరూ సహకరించి తమ ఇండ్లలోని వాడబడిన, పనికిరాని వస్తువులను ప్లాస్టిక్, కవర్లు,పుస్తకాలు,పాదరక్షలువినియోగంలో లేని దుస్తులు, గాజులు  ఆర్ ఆర్ ఆర్ కేంద్రం చమన్ వద్దకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు,ఆర్ పి లు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు