Tuesday, 3 November 2026

అధికార లాంఛనాలతో ఎర్రన్నాయుడి అంత్యక్రియలు

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన తెదేపా సీనియర్‌నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు నిమ్మాడలోని వ్యవసాయక్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఎర్రన్నాయుడు భౌతిక కాయం వద్ద పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడుతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. నిమ్మాడలోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తల రోదనలతో నిమ్మాడ శోకసంద్రంగా మారిపోయింది. తెదేపా ఓ మంచి నాయకుడిని కోల్పోయిందని పలువురు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *