Tuesday, 3 November 2026

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కంచర్ల రవి గౌడ్.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూన్ 28. (జనంసాక్షి). నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కంచర్ల రవి గౌడ్ అన్నారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమాన్యాలపై కఠినంగా వ్యవహరించాలని కోరుతూ అధికారులకు ఇచ్చిన వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. చర్యలు తీసుకొని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ప్రకాష్ నరేష్ పలు నాయకులు పాల్గొన్నారు.