Tuesday, 3 November 2026

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షునిగా ధనుంజయ ఏకగ్రీవ ఎన్నిక…. పద్మశాలి కులస్తుల ముందర నూతన కమిటీకి అంగరంగ వైభవంగా ప్రమాణ సికారోత్సవం.. .

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి జిల్లా అధ్యక్షునిగా తిరందా ధనంజయ ఎకగ్రీవంగా ఎన్నుకోబడినారు అందులో భాగంగా బుధవారం రోజున మాస్కుంట ఎస్ఎంఎస్ ఫంక్షన్ హాల్ లోని ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా కుల పెద్దల సాక్షిగా 17 మండలాల నుండి వచ్చినటువంటి పద్మశాలీల కులస్తుల ముందట ప్రమాణ స్వీకారం చేసినారు వారిచే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్మడి జిల్లాల మార్గదర్శకులు సిరిపోలు వెంకటపతి గారు చిట్టిప్రోలు శ్రీనివాస్ గారు తెలంగాణ పద్మశాలి కుల బాంధవులు పెద్దలు రామా శ్రీనివాస్ గారు ముఖ్యఅతులుగా విచ్చేసి తిరందాస్ ధనుంజయ గారిచే ప్రమాణ స్వీకారం చేయించినారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా తడక రమేష్ గారితో ఉపాధ్యక్షులుగా బాల్ లింగం గారిచే ప్రధాన కార్యదర్శి రాపోలు వీర మోహన్ గారిచే గారిచే వర్కింగ్ సెక్రటరీ చిట్టిపూలు శ్రీధర్ గారిచే అన్ని మండలాల నుండి వచ్చేసినటువంటి కార్యదర్శులతో ఉపాధ్యక్షులతో ప్రమాణ స్వీకారం మహోత్సవం చేయించారు ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొని ప్రమాణ స్వీకారం చేసినారు ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ జిల్లా సలహాదారులు గౌరవాధ్యక్షులు గౌరవ అధ్యక్షులు చించు నాగభూషణం గారు బడుగు నరసింహ గారు మింగి బిక్షపతి గారు కోశాధికారి బింగి రాములు గారు కుల పెద్దలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దివ్యపరిచినారు జిల్లా అధ్యక్షులు చిరేంద్ర ధనుంజయ మాట్లాడుతూ కుల పెద్దలకు ఏ ఆపద వచ్చినా జిల్లాలో చదువుకునే పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తానని కుల పెద్దల సాక్షిగా మాట ఇచ్చారు. జై పద్మశాలి జై జై పద్మశాలి యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ సెక్రటరీ చిట్టిప్రోలు శ్రీధర్ పద్మజాల సంఘం నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.