Tuesday, 3 November 2026

అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఎస్ ఏ అధ్యక్షులు మంగ ప్రవీణ్

భువనగిరి టౌన్ జనం సాక్షి ):–అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ ఆఫీస్ సుపరిండెంట్ గారికి ఎస్ వి ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ వి ఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో రకరకాల ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద అధికంగా డబ్బులు రాబట్టుకుంటున్నారని, అన్ని స్కూళ్లలో విద్యాహక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీని నియమించి ప్రతినెల పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసేలా చూడాలని, సరైన వసతులు లేని, అర్హత గల ఉపాధ్యాయులు లేని స్కూళ్లను సీజ్ చేయాలని డీఈఓ ఆఫీస్ సుపరిండెంట్ వెంకటకృష్ణారెడ్డికి తెలియజేశామన్నారు. ప్రైవేటు స్కూలు విద్యాహక్కు చట్టంకు విరుద్ధంగా ఎటువంటి చర్యలకు పాల్పడ్డ అట్టి స్కూల్లను సీజ్ చేసేదాకా NSUI పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఐ జిల్లా కార్యదర్శులు భువనగిరి ఉపేందర్, పాండాల శరత్, ఎండి. మసూద్, నాయకులు బోల్లేపల్లి వినయ్, కొండోజు సాయి, వడ్డేబోయిన బన్ని తదితరులు పాల్గొన్నారు