జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన ఉదరి ప్రమీల అనారోగ్యంతో భాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ ని సంప్రదించగా వారు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 2,50,000 ఎల్.ఓ.సి మంజూరు చేయించారు.
మంజూరైన ఎల్ఓసి ని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వ్యక్తిగత సహాయకులు నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి శనివారం ప్రమీల కుటుంబ సభ్యులకు అందజేశారు.




