Thursday, 5 November 2026

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

 

 

 

 

 

 

 

రాజంపేట్ ఏప్రిల్ 14 (జనంసాక్షి)మండలకేంద్రంతో పాటు పొందుర్తి తలమడ్ల అరగొండ కొండాపూర్ గుండారం సిద్దాపూర్ అన్నారం గ్రామాల్లో పలు చోట్ల సర్పంచులు పలు చోట్ల ఎంపీటీసీలు బాబా సాహెబ్ 132వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంతక ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పారటం చేసిన మహానియుడని కొనియాడారు. యువత బాబాసాహెబ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  సర్పంచులు ఎంపీటీసీ రాజంపేట్ ఎస్సై రాజు గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గంగారెడ్డి ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు గుర్రాల రాము ఓబీసీ అధ్యక్షులు పందుల చిన్నస్వామి దగ్గరి స్వామి.రాజంపేట్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మరియు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.